- ఆర్టీసీ 5 రోజుల స్పెషల్ ప్యాకేజీ .. ఒక్కొక్కరికి రూ.5,130
హైదరాబాద్‌సిటీ, వెలుగు: నగరం నుంచి ముఖ్యమైన కొన్ని క్ష్రేత్రాల సందర్శనతో పాటు గోవా టూర్‌ను పొందుపరిచి స్పెషల్ప్యాకేజీని తీసుకువచ్చింది ఆర్టీసీ. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే ఈ టూర్ మార్చి1 వరకు కొనసాగనున్నది. 25 న బీహెచ్ఈఎల్డిపో నుంచి రాజధాని ఏసీ బస్సు బయలుదేరుతుంది. 26న కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, 27న ఉడిపి, మురుదేశ్వర్, రెండు రోజులు గోవా టూర్అంటే 1వ తేదీ వరకు గోవాలో బీచ్‌లు ఇతర టూరిస్ట్ ప్లేస్‌ల విజిట్ఉంటుంది. తిరుగు ప్రయాణం మార్చి1 ఉదయం 6 గంటలకు ఉంటుంది. ఒక్కొక్కిరికి రూ 5,130 చార్జ్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్లో www.tgsrtcbus.in ద్వారా బుక్ చేసుకోవచ్చని బీహెచ్ఈఎల్ డిపో మేనేజర్ తెలిపారు.
